గురుకులాల కిట్ల కొనుగోళ్లలో అక్రమాలు: అధికారుల వసూళ్ల పర్వం బట్టబయలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ బ్యూరో
గురుకులాల విద్యార్థులకు అందించే వస్తువుల కొనుగోళ్లలో రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పెద్దఎత్తున ముడుపుల వసూళ్లు జరిగాయని పలువురు అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల్ లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ పేరుతో కాంట్రాక్టు సంస్థల నుంచి అధికారులు కమీషన్లు దండుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిధుల దుర్వినియోగం కారణంగా విద్యార్థులకు నాసిరకం యూనిఫామ్లు, షూలు, దుప్పట్లు సరఫరా అవుతున్నాయని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.