కాంగ్రెస్ చరిత్ర మరిచి మాట్లాడుతున్నారు: రాహుల్ గాంధీపై రామ్ మాధవ్ ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చరిత్ర మరిచి మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాహుల్ ఆరోపణలు అవాస్తవమని కొట్టేశారు. మరణించిన వారి ఓట్లు, అక్రమ వలసదారుల పేర్లను తొలగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతోందని ఆయన నిలదీశారు. అక్రమ ఓట్లతో గెలవడం ఆ పార్టీకి అలవాటేనని మండిపడ్డారు.