సివిక్ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను నిలదీత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మందమర్రి

మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లో బీ-జోన్ సివిక్ టెండర్లను తక్షణమే ప్రారంభించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిప్యూటీ జీఎం సివిల్ కు మెమోరండం సమర్పించారు. ఏరియా పెద్దది కావడంతో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, టెండర్ గడువు ముగియడంతో ఉపాధి కోల్పోతున్నామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న సులబ్ కాంప్లెక్స్ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.