సెన్సార్ పూర్తి చేసుకున్న నాని ది ప్యారడైజ్ చిత్రానికి ఏ సర్టిఫికెట్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు, కొన్ని సంభాషణలు మరియు వివాదాస్పద పదాలపై మొత్తం 21 మార్పులు సూచించడంతో, వాటిని సవరించిన అనంతరం తుది నిడివి సుమారు 174 నిమిషాలతో సినిమా విడుదలకు సిద్దమైంది.