ఇండియన్ సూపర్ లీగ్: ముంబై సిటీ జట్టుపై స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీ సంచలన విజయం

రిపోర్టర్: సతీష్ స్థలం: Mumbai

మనోలో మార్క్వెజ్ శిక్షణలోని ముంబై సిటీ జట్టుపై స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీ మూడు రెండు గోల్స్ తేడాతో సంచలన విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్ లో తొలుత రెండు గోల్స్ ఆధిక్యంలో నిలిచిన ముంబై, ఆఖరి నిమిషాల్ లో వరుసగా గోల్స్ సమర్పించుకుని ఓటమిపాలైంది. సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు అక్షత్ మెహ్రా, రిచర్డ్ ఎన్ డాయిషిమియెలతో పాటు జువాన్ సెబాస్టియన్ బెర్ముడెజ్ చివరి క్షణాల్ లో గోల్స్ చేసి ఢిల్లీకి అద్భుతమైన విజయాన్ని అందించారు.