నిమ్మకాయల అలంకరణలో చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారు!
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
చీపురుపల్లిలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారిని భక్తులు సమర్పించిన 580 కిలోల నిమ్మకాయలతో అర్చకులు అత్యంత సుందరంగా ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, దేవస్థానం ఈవో ఎస్.నానాజీ బాబుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.