మధ్యప్రదేశ్ హైకోర్టులో కీలక పరిణామం: తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లిన యువతి
రిపోర్టర్: సతీష్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ హైకోర్టులో జరిగిన విచారణలో ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు అంగీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన కౌన్సెలింగ్ తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. చదువు కొనసాగించేందుకు అనుమతించడం, కుటుంబ విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యం ఉండకూడదనే షరతులతో ఆమె ఇంటికి వెళ్లేందుకు సమ్మతించడంతో హైకోర్టు పిటిషన్‌ను ముగించింది.