సివిల్ సర్వీస్ ఎంపిక ప్రక్రియను ఆధునీకరించాలని నరేంద్ర మోడీ పిలుపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

సివిల్ సర్వీస్ ఎంపిక ప్రక్రియను ఆధునీకరించాలని, ఉద్యోగుల సెల్ఫ్ అప్రైజల్ పద్ధతిని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలని, పేదల సమస్యల సత్వర పరిష్కారానికి సాంకేతికతను మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా వాడాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా ఆయన ఆవిష్కరించారు.