మహిళల ఆసియాకప్ విజేతగా భారత్, ట్రోఫీ ఇచ్చేందుకు నిరాకరణ
రిపోర్టర్: రాము
స్థలం: World
మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఎనిమిదోసారి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఏసీసి అధ్యక్షుడు మోసిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు నిరాకరించడంతో ఆయన స్టేడియంను వీడి వెళ్లారు.