మాజీ జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మను ఘనంగా సన్మానించిన యాజమాన్యం

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో మాజీ జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మను శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. వివాదరహితంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను మంగళవారం స్వగృహంలో కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.