కాన్పూర్ వ్యాపారవేత్త హత్య కేసులో కోడలు అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఫార్మా వ్యాపారవేత్త వినీత్ మినోచా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మామపై కక్షతో కోడలు షాలు రూ. 6 లక్షల సుపారీ ఇచ్చి మాజీ ఉద్యోగితో హత్య చేయించింది. హత్య సమయంలో కుమారుడు సుబ్రత్ పార్టీలో ఉండగా, నిందితుడు అతనికి ఆరుసార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కోడలుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.