గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట

రిపోర్టర్: సతీష్ స్థలం: భారతదేశం

వంట గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తూ కేంద్రమంత్రి సురేశ్‌ గోపీ కీలక నిర్ణయం వెల్లడించారు. ఎల్పీజీ సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.