రోడ్డు సౌకర్యం లేక గర్భిణీని డోలీపై ఆసుపత్రికి తరలింపు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బి.సింగవరం గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ గెమ్మెలి కుమారిని గ్రామస్థులు డోలీపై మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులకు అర్జీలు ఇచ్చినా, నాయకులను కలిసినా సమస్య పరిష్కారం కావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.