'ఆంధ్రప్రదేశ్ మంచి వ్యక్తిని కోల్పోయింది': మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఏలూరు జిల్లా

ఏలూరు జిల్లాలో జరిగిన మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేష్‌తో పాటు మంత్రులు నిమ్మల, పార్థసారథి పాల్గొన్నారు. నాని కుటుంబ సభ్యులను పరామర్శించి లోకేష్ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఆళ్ల నాని ఏ రోజు వ్యక్తిగత విమర్శలు చేయకుండా, చాలా హుందాగా ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడారని, రాష్ట్రం మంచి వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.