శ్రీశైల ఉత్సవాలకు ఆహ్వానం: బీజేపీ నేత తల్లోజు ఆచారికి అహ్వానపత్రిక అందజేత
రిపోర్టర్: Anjaneyulu Yadav
స్థలం: కల్వకుర్తి
శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ పదకొండు నుంచి ఇరవై వరకు నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారిని బుధవారం ఆహ్వానించారు. దేవస్థానం పాలక మండలి సభ్యుడు కట్టా సుధాకర్ రెడ్డి ఆహ్వానపత్రిక అందజేసి ఉత్సవాలకు తప్పక హాజరుకావాలని ప్రత్యేకంగా కోరారు.