కొడాలి నాని వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో కృష్ణా జిల్లాలో వైసీపీ భూస్థాపితమంటూ మంత్రి కొల్లు రవీంద్ర మండిపాటు

రిపోర్టర్: నరేష్ స్థలం: కృష్ణా

వైసీపీ నేతలు కొడాలి నాని మరియు వల్లభనేని వంశీ వ్యాఖ్యల కారణంగానే కృష్ణా జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదేవిధంగా మరో నేత పేర్ని నాని అనుసరిస్తున్న వైఖరి వల్ల జిల్లాలో ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా రాజకీయ పరిణామాలపై మంత్రి కొల్లు రవీంద్ర సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు గుప్పించారు.