సినిమా విశేషాలు పంచుకున్న దొంగ నా కొడుకు హీరోయిన్ సుష్మితా శెట్టి
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'దొంగ నా కొడుకు' చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని హీరోయిన్ సుష్మితా శెట్టి తెలిపారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో తాను చాలా క్యూట్ అండ్ బబ్లీ పాత్రలో కనిపిస్తానని, ఈ చిత్రం అందరినీ కచ్చితంగా అలరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.