పిన్నవలసలో ఘనంగా అంతర్జాతీయ ఆయుర్వేద మెగా వైద్య శిబిరం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బాడంగి
విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని పిన్నవలస గ్రామంలో అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యాధికారిని శెట్టి ఉమాదేవి ఆధ్వర్యంలో మెగా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ సిబ్బంది, అంగన్వాడీలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.