ఐదు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన హర్యానా సీఐడీ ఇన్ స్పెక్టర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హర్యానా
హర్యానాలోని కురుక్షేత్రలో ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సీఐడీ ఇన్ స్పెక్టర్ రాజేష్ కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మైనింగ్ వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండేందుకు ఆయన భారీగా లంచం డిమాండ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.