జాతీయ రహదారిపై ప్రమాదాల బీభత్సం: ఆరు నెలల్లో ఏడు మంది దుర్మరణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
పెదమానాపురం మరియు ఎస్ బూర్జవలస పోలీసు స్టేషన్ల పరిధిలోని జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోందని ఎస్సైలు కళాధర్ మరియు ప్రయోగమూర్తి తెలిపారు. గత ఆరు నెలల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో ఏడు మంది ప్రాణాలు కోల్పోగా పది మంది తీవ్రంగా గాయపడ్డారని వారు పేర్కొన్నారు. అతివేగం, నిద్రలేమి కారణంగానే తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.