ఆరోగ్యమే మహాభాగ్యం: శాకాహారానికి మించి వీగన్ జీవనశైలి ప్రత్యేకతలు ఏమిటి

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

శాకాహారానికి భిన్నంగా జంతువుల నుండి లభించే ఏ ఒక్క ఉత్పత్తులను వాడకుండా కేవలం మొక్కల ఆధారిత పదార్థాలతో జీవించడమే వీగన్ జీవనశైలి అని ది వీగన్ సొసైటీ వెల్లడించింది. ప్రపంచ వీగన్ దినోత్సవం సందర్భంగా ఈ విధానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ గురించి నిపుణులు వివరిస్తున్నారు. మన దేశంలోనూ ఈ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.