విద్యార్థులను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాలని పిలుపునిచ్చిన జి కవిత

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాలకు అలవాటు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి కవిత అన్నారు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి సమానమైన న్యాయాన్ని అందించడమే ఈ సంస్థ ఉద్దేశమని ఎలాంటి సమస్యలు ఎదురైనా ఉచిత న్యాయ సేవలను అందించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు