పులివెందులలో ప్రజాస్వామ్య ఖూనీ: కూటమి సర్కార్ తీరుపై వైఎస్ జగన్ నిప్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పులివెందుల
పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో నిలదీశారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తున్నారని, తనను అడ్డుకునేందుకు ఫ్లైట్ ల్యాండింగ్ కు కూడా ఆటంకాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకే భారీగా పోలీసులను మోహరించారని విమర్శిస్తూ, అక్రమాలకు వ్యతిరేకంగా రిటర్నింగ్ అధికారిని కలవనున్నట్లు జగన్ స్పష్టం చేశారు.