గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం

రిపోర్టర్: సురేష్ స్థలం: Gachibowli, Hyderabad

హైదరాబాద్ గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. కేవలం యాభై గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా భవనం కూలిపోయే అవకాశం ఉందంటూ స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.