బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు పూర్తిగా ద్రోహం చేశారు

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

తెలంగాణ హక్కులను కాపాడటంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల వంటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నా జాతీయ పార్టీల నేతలు నోరు మెదపడం లేదని, సొంత అధిష్టానాల ముందు గొంతు విప్పే దమ్ము వారికి లేదని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.