ఓటీటీకి అనకాపల్లి సినిమా: సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'అనకాపల్లి' సినిమా త్వరలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ లో నవంబర్ మూడో తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.