కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

రిపోర్టర్: వెంకట్ స్థలం: Kodangal, Telangana

కొడంగల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులే కీలమని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగంపై ఆయన ఆరా తీశారు.