భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిసిన గణేష్ ఉత్సవాలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ రాజా వీధిలో రాజా యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అర్చకులు కుమార్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ వేడుకల్లో స్థానిక పిల్లలు, పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని గణేశుడికి పూజలు సమర్పించారు. అనంతరం భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించడంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.