అనుమతులు లేని అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశం
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నుడా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులో నుడా కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లను అవసరమైతే డెమాలిష్ చేయాలని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, అనుమతులు లేని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేయవద్దని చైర్మన్ హెచ్చరించారు.