బైండోవర్ ఉల్లంఘన: నర్సంపేటలో దాడికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట పట్టణంలో బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మరోసారి దాడికి పాల్పడిన వ్యక్తికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జైలు శిక్ష విధించారు. రెండు నెలల క్రితం నమోదైన కేసులో తహసీల్దార్ ఎదుట బైండోవర్ అయిన నిందితుడు, ఇటీవల మళ్లీ దాడికి తెగబడ్డాడు. దీంతో స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు పంపినట్లు అధికారులు వెల్లడించారు.