భార్యను తొలగించారని స్కూల్ సాంబార్‌లో పేడ కలిపిన వ్యక్తి అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఈరోడ్, తమిళనాడు

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యను వంట మనిషి ఉద్యోగం నుండి తొలగించారన్న కక్షతో ఆర్ముగం అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాల సాంబార్‌లో గోవు పేడ పొడిని కలిపాడు. టీచర్లు రుచి చూసే శాంపిల్‌లో ఇది కలపడంతో విషయం బయటపడింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తూ విద్యార్థులకు ఎటువంటి హాని జరగలేదు.