కోవూరులో సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేత
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో 29వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ విడతలో 61 మంది లబ్ధిదారులకు రూ.44.86 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో మొత్తం 1,054 చెక్కుల ద్వారా రూ.10.75 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. పేదల ఆరోగ్య అత్యవసరాలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని ఆమె తెలిపారు.