గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే ఇక స్థానిక ఆదాయం జమ
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో గ్రామ పంచాయతీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల స్థానిక ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేయకుండా నేరుగా సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేసే వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ విధానంతో పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి లభించి, అభివృద్ధి పనులు వేగంగా జరగనున్నాయి.