సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా లక్షకు పైగా బోనస్
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
సింగరేణి సంస్థ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త అందించింది. దీపావళి బోనస్ కింద ఒక్కో కార్మికుడికి లక్షా పది వేల రెండు వందల యాభై రూపాయలను వచ్చే నెల ఐదో తేదీన నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో సంస్థలో నిబద్ధతతో పనిచేస్తున్న సుమారు ముప్పై ఎనిమిది వేల మంది కార్మికులకు నేరుగా భారీ ఆర్థిక లబ్ధి చేకూరనుంది.