పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ డిమాండ్
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని మందస మండలంలో యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పాఠశాలలను సందర్శించి వివరాలు సేకరించారు. ప్రభుత్వ విధానాలపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ఐక్యతతో భవిష్యత్తులోనూ పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.