జూరాల ప్రాజెక్టు వద్ద సాగునీరు విడుదల చేయాలని రాస్తారోకో
రిపోర్టర్: విజయ్
స్థలం: వనపర్తి
వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద భాజపా ఆధ్వర్యంలో రైతులు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాస్తారోకో చేపట్టారు. జూరాల కాలువల ద్వారా నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయని నాయకులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి, లావణ్య, అశ్విని కుమార్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు.