ఉజ్జైనిలో విషాదం: హోటల్ వేస్ట్ ఛాంబర్ శుభ్రం చేస్తూ నలుగురు మృతి

రిపోర్టర్: హరి స్థలం: Ujjain

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జైని నగరంలో గల ఓ ప్రైవేట్ హోటల్ లో వేస్ట్ ఛాంబర్ శుభ్రం చేస్తుండగా శ్వాస ఆడక నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. శ్రీ గంగా హోటల్ లో జరిగిన ఈ దారుణ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.