దేవునిగూడలో కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామంలో పోకల వంశీపై కత్తితో హత్యాయత్నం చేసిన సాట్ల సాయిశివను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వంశీని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.