విజయనగరం ఎంపీ వినూత్న దసరా వేడుకలు: తొలి వాహనమైన సైకిల్కు ప్రత్యేక పూజలు

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన నివాసంలో వినూత్న రీతిలో దసరా వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. టీడీపీ ఎన్నికల గుర్తు కావడంతో పాటు తన రాజకీయ మరియు వ్యక్తిగత జీవితంలో తొలి వాహనంగా నిలిచిన సైకిల్కు ఆయన విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం తన సతీమణితో కలిసి కాసేపు సరదాగా సైకిల్ తొక్కుతూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పసుపు రంగు శుభప్రదమైనదని భావిస్తూ ప్రతి ఏటా ఈ ఆనవాయితీ పాటిస్తున్నట్లు ఎంపీ వివరించారు.