ఓటీటీలోకి సంచలన సైకలాజికల్ థ్రిల్లర్: జీ5లో ఆశ స్ట్రీమింగ్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
దిగ్గజ నటి ఉర్వశి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఆశ డిజిటల్ ప్రీమియర్ను జీ5 ప్రకటించిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. నూతన దర్శకుడు సఫర్ సనల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ పదహారు నుంచి ప్రముఖ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందని నిర్వహకులు తెలిపారు.