పెద్దపల్లి కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటున్న వైనంపై ఎంపీ వంశీకృష్ణ నిప్పులు
రిపోర్టర్: సురేష్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. జిల్లా మంత్రి శ్రీధర్ బాబు వ్యవహారశైలిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా అధికారులను అడ్డుపెట్టుకుని తమను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారని వంశీకృష్ణ విమర్శించారు. ఎయిర్పోర్టు, ఈఎస్ఐ ఆస్పత్రి లాంటి అభివృద్ధి పనులకు సొంత పార్టీ నేతలే మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు.