పలాసలో మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించిన మున్సిపల్ అధికారులు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో భారీ వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు కాశీబుగ్గ ఎల్ సీ గేట్ సమీపంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఆక్రమణలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఈ చర్యపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు సాఫీగా ప్రవహించడం వల్ల వరద ముప్పు తగ్గుతుందని స్థానికులు భావిస్తున్నారు.