అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు: శాన్ ఫ్రాన్సిస్కోలో వైభవంగా ఉత్సవాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: శాన్ ఫ్రాన్సిస్కో

శాన్ ఫ్రాన్సిస్కో లోని సిటీ హాల్లో భారతీయ అమెరికన్ సమాజం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు కాన్సులేట్ అధికారులు తెలిపారు. ఇండియాస్పోరా సంస్థ ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్, శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ డేనియల్ లూరీ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ఇరు దేశాల బంధాన్ని కొనియాడారు.