రోడ్డు పనుల నాణ్యతా లోపంతో కూరుకుపోయిన సిమెంట్ టిప్పర్
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయితీ కోరుకొండ నుంచి కుడుములు గ్రామం వెళ్తున్న మార్గంలో సిమెంట్ బిడ్డను తీసుకువస్తున్న టిప్పర్ వాహనం రోడ్డు పూర్తిగా దిగిపోయి అలాగే నిలిచిపోయింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.