తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

దేశవ్యాప్తంగా పసిడి ప్రియులకు ఊరటనిస్తూ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ముగిశాయి. భాగ్యనగరం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,41,700 ఉండగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి తులం ధర రూ.1,54,580 వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌లో ధరలు మళ్లీ యథాతథంగా ఉండటంతో కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.