సెప్టెంబర్ 9న అంచనాలను తలకిందులు చేసేలా ఆపిల్ ఈవెంట్!
రిపోర్టర్: సతీష్
స్థలం: World
టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆపిల్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9న రాత్రి జరగనుంది. నూతన సీఈవో జాన్ టెర్నస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు, సంస్థ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ 'అల్ట్రా'ను ఆవిష్కరించే అవకాశం ఉంది. అలాగే కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌ను కూడా లాంచ్ చేయనుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.