గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ పాలన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తలకొండపల్లి

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు స్వర్ణయుగం నడిచిందని బీఆర్ఎస్ ఎస్టీ సెల్ నాయకులు కోర్ర కృష్ణ నాయక్ తెలిపారు. తలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తండాలు గ్రామపంచాయతీలలో ఉండేవని, ప్రతి తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా మార్చి గిరిజనులకు స్వయం పాలన కల్పించారని కొనియాడారు. గిరిజనుల విద్య కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు రైతుబంధు, రైతుబీమా, పోడు భూములకు పట్టాలు అందజేసి వారి సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.