కాంగ్రెస్ పాలనపై భద్రాద్రిలో బీఆర్ఎస్ విద్యార్థుల భారీ నిరసన ర్యాలీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. వెయ్యి రోజుల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి సంస్థకు అప్పగిస్తే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం దారుణమని, ఉద్యోగ సంఘాల ఆందోళనకు పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.