నవీ ముంబైలో ఘోర గ్యాస్ సిలిండర్ పేలుడు
రిపోర్టర్: మహేష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్ర నవీ ముంబైలోని సన్పాద సెక్టార్ 1లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సాగర్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ప్రమాద తీవ్రతకు భవనం దెబ్బతినింది. చుట్టుపక్కల షాపులు, సమీపంలోని ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.