మచిలీపట్నంలో భర్త మోసంపై అత్తవారింటి ఎదుట వివాహిత నిరసన

రిపోర్టర్: సురేష్ స్థలం: మచిలీపట్నం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అనాథనైన తనను పెళ్లయిన కొన్ని రోజులకే భర్త పెంకు ఫణి కుమార్ మోసం చేసి పరారయ్యాడంటూ జయలక్ష్మి అనే వివాహిత అత్తవారి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆగస్టు 30న వీరి వివాహం జరగగా, కొద్దిరోజులు కాపురం చేసిన అనంతరం భర్త ముఖం చాటేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తానని, మంత్రి కొల్లు రవీంద్ర స్పందించి తనకు అండగా నిలవాలని జయలక్ష్మి డిమాండ్ చేసింది.